ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ను బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచందర్ రావు కలిశారు. హుజురాబాద్ పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్లను వేరే వాహనంలోకి తరలించడంపై ఆయనకు ఫిర్యాదు చేశారు. రాత్రి జరిగిన వీవీ ప్యాట్ల తరలింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు.
హుజురాబాద్ పోలింగ్ లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు.
ఈ మేరకు ఎన్నికల ప్రధాని అధికారి శశాంక్ గోయల్ కి ఓ వినతి పత్రం కూడా అందజేశారు.సిబిఐ విచారణ తో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. కౌంటింగ్ సమయంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు ఈసీని కోరారు. మరి వీవీ ప్యాట్ల తరలింపుపై సీబీఐ విచారణ జరిపిస్తారా లేదా అన్నది చూడాలి.