సర్వే: హుజూరాబాద్ లో ఈటెల ఓటమి ఎంతలో...?
హుజూరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై చాలా అంచనాలు ఉండగా వచ్చిన సర్వే ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ ప్రకారం ఈటెల రాజేంద్ర ఓడిపోయే అవకాశం ఉందని అధికార పార్టీ గెలిచినా భారీ తేడాతో గెలిచే అవకాశం లేదని చెప్పింది. ఈ ఎన్నికల్లో ఈటెల రాజేంద్రపై తెరాస అభ్యర్ధి శ్రీనివాస్ 45 శాతం నుంచి 49 శాతం వరకు ఓటింగ్ సాధించే అవకాశం ఉందని...
బిజెపి అభ్యర్ధి ఈటెల కు 43 నుంచి 46 శాతం లోపే ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేసారు. ఇక కాంగ్రెస్ కేవలం నాలుగు శాతం మాత్రమే అని ఇక ఇతరులు ఏడు శాతం వరకు పోలింగ్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభావం కొంత మాత్రమే ఉందని సర్వేలు తెలిపాయి.