బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?

RATNA KISHORE
ఒక ఉప ఎన్నిక‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ ఒక‌టి న‌డుస్తోంది. అదే అధికార దుర్వినియోగం. సాఫీగా సాగిపోవాల్సిన ఉప ఎన్నిక‌లు కాస్త గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణంలో న‌డుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎవ‌రి పంతాలు వారు నెగ్గించుకునే క్ర‌మంలో
బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లు ఇవాళ జ‌రుగుతున్నాయి. పోలింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించి  చాలా ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి. ముఖ్యంగా దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని అధికార పార్టీపై ఆరోప‌ణ‌లు చేస్తోంది బీజేపీ. ప‌క్క ప్రాంతాల నుంచి కూడా ఓట‌ర్ల‌ను త‌ర‌లిస్తూ ఓట్లేయించుకున్న ఘ‌న‌త వైసీపీదేన‌ని అంటోంది. కానీ ఎన్నిక‌ల అధికారి విజ‌యానంద్ మాత్రం ఈ ఆరోప‌ణ‌లను కొట్టిపారేశారు. కానీ ఇవ‌న్నీ న‌మ్మే విధంగా లేవ‌ని బీజేపీ అభ్య‌ర్థి సురేశ్ ఆవేద‌న చెందుతున్నారు. అదేవిధంగా ఓట్ల గ‌ల్లంతు పై కూడా అనేక ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల స్థానిక ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని దీంతో  చేసేది లేక ఓట‌ర్లు వెనుదిరిగి పోయార‌ని బీజేపీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: