రఘుబాబులో ఇలాంటి టాలెంట్ ఉందని మీకు తెలుసా...!?

Suma Kallamadi
సినిమా ఇండస్ట్రీలో కొనసాగే వారిలో చాలామంది నటనతో పాటు ఏదో ఒక టాలెంట్‌ను కలిగి ఉంటారు. ముఖ్యంగా కమెడియన్లకు ఈ టాలెంట్ అనేది ఏం తప్పనిసరిగా ఉంటుంది ఉదాహరణకు బ్రహ్మానందాన్ని తీసుకుంటే ఆయన పెయింటింగ్ బాగా వేస్తారు. ఎమ్మెస్ నారాయణ మంచిగా కథలు రాస్తారు. ఎల్బీ శ్రీరామ్ కూడా మంచి రచయిత. వీరి టాలెంట్స్‌ ఇప్పటికే బయటపడగా ఇప్పుడు మరొక కమెడియన్ టాలెంట్ వెలుగులోకి వచ్చింది. అతడు మరెవరో కాదు ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు. ఈ కమెడియన్ ప్రముఖ నటుడు గిరిబాబుకు కుమారుడు అవుతాడు.
ఇతడు వేసే వన్ లైన్ పంచులు అమాయకమైన యాక్టింగ్ బాగా నవ్విస్తాయి. అయితే నటన మాత్రమే కాకుండా ఇతడిలో సింగింగ్ టాలెంట్ కూడా ఉందని తాజాగా తెలిసింది. రఘుబాబు స్వయంగా తన గొంతుతో  ఒక తమిళ పాట పాడారు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది చూసి రఘుబాబు లో ఈ టాలెంట్ కూడా ఉందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో "వసంత కోకిల" చిత్రంలోని "కథగా కల్పనగా" పాట తమిళ వర్షన్‌ను రఘుబాబు ఆలకించడం చూడవచ్చు. ఆయన పాట పాడుతుంటే అచ్చం ప్రొఫెషనల్ సింగర్ పాడినట్లుగానే అనిపించింది.
శ్రీదేవి, కమల్ హాసన్ నటించిన ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయింది. పాట కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఆ పాట రఘు బాబుకి కూడా బాగా ఇష్టమై ఉంటుంది అందుకే దాని నేర్చుకొని తనలోని గాయకుడిని బయట పెట్టాడు. చాలామంది ఆయన ప్రతిభను పొగుడుతున్నారు. కొందరైతే "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రంలో రఘుబాబు పాడిన లంగావోణీ సాంగ్ సీన్ గుర్తుతెచ్చుకొని ఇంతకు నవ్వుకుంటున్నారు. అలాంటి వాయిస్ ఉన్న రఘుబాబు ఇంత కమ్మటి వాయిస్ తో కూడా పాడగలరా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రఘుబాబు కమెడియన్లు అంటే అద్భుతమైన ప్రతిభావంతులు అని మరొకసారి నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: