Renudesai: రూ.3500 సాయం కోరిన పవన్ మాజీ భార్య.. కొత్త అనుమానాలకు తెర..!

Divya
 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ మాజీ భార్య ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈమె తాజాగా రూ.3,500 ఆర్థిక సహాయాన్ని అభిమానులను కోరుతూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. అయితే ఈమె ఇలా పోస్ట్ చేసిందో లేదో అతి తక్కువ సమయంలోనే అభిమానులు కూడా స్పందించారు.. కానీ కొంతమంది రేణూ దేశాయ్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని ..ఆమె ఎందుకు రూ .3,500 సహాయం అడుగుతుంది అని .. అంత తక్కువ అమౌంట్ కూడా ఆమె దగ్గర లేదా ? ఆమె అంత దీనస్థితిలో ఉందా? అంటూ రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేశారు. దీంతో మొదటిసారి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది రేణూ దేశాయ్...
రూ.3,500 అడిగింది నేనే..తాజాగా దీనిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ..స్వయంగా ఒక వీడియో చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది..  నేను రెగ్యులర్ గా డొనేట్ చేస్తూ ఉంటాను.. అయితే నేను ప్రతి నెల యానిమల్స్ కి కొంత బడ్జెట్ మాత్రమే పెట్టుకుంటాను. ఈ మంత్ ఆల్రెడీ అది దాటేసింది.. అందుకే రూ.3,500 ఎవరైనా డొనేట్ చేయమని చెప్పాను.. ముఖ్యంగా నేను సంపాదించే డబ్బులు కొంచెం ప్రతినెలా ఖర్చులకు పెట్టుకుంటాను. అందులో చిన్న పిల్లల ఫుడ్ కోసం , యానిమల్స్ కోసం ఇలా డొనేషన్స్ కోసం కేటాయించుకుంటాను.. ఇప్పుడు అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి అడగడం జరిగింది. నా అకౌంట్ ని ఎవరు హ్యాక్ చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది..
ఇకపోతే ప్రస్తుతం తాను యానిమల్స్ కోసం షెల్టర్ కూడా కడతున్నాను..త్వరలోనే అఫీషియల్ గా డొనేషన్స్ తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అని తన అకౌంట్ హ్యాక్ కాలేదు అని తెలిపింది రేణు దేశాయ్.. ఇక ప్రస్తుతం షెడ్ నిర్మాణ పనుల్లో ఉంది అని ఒకటిన్నర ఏడాది సమయం పడుతుందని అప్పుడు అఫీషియల్ గానే డొనేషన్స్ స్వీకరిస్తాము అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: