అంచనాలకు మించి పెరిగిపోతున్న కన్నప్ప మూవీ బడ్జెట్.. ఎంతో తెలిస్తే మతిపోతుంది..!?

Anilkumar
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా బాగానే సక్సెస్ అయ్యాడు మంచు విష్ణు. అయితే ఎంతో కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న  విష్ణు ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా కన్నప్ప. అయితే భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. కాగా మంచు విష్ణు ఈ సినిమాను దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది.  ఈ సినిమాతో మంచు విష్ణు పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలి అని టార్గెట్

 పెట్టుకొని సినిమాను నిర్మిస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఈ సినిమాను హై క్వాలిటీ తో తెరకెక్కిస్తున్నారట. మొత్తానికి అయితే ఇప్పుడు మంచు విష్ణు తీస్తున్న ఈ సినిమా బడ్జెట్ రోజుకి పెరిగిపోతుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు విష్ణు భారీ అంచనాలను పెట్టుకుని తీస్తున్న ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా బాగా హైలెట్ గా నిలవాలి అని నానా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ను తీసుకోవడంతో సినిమా బడ్జెట్ అత్యధికంగా పెరిగిపోయిందని

 అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ సైతం నటిస్తున్నాడు.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా  తీసుకోకుండానే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ తప్పించి మిగిలిన స్టార్స్ అందరూ కూడా భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారట. అంతేకాదు సినిమా మేకింగ్ కి అయ్యే ఖర్చు కూడా భారీ స్థాయిలోనే ఉంటుందట. అందువల్లే సినిమాకి మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు బాగా పెరిగిపోయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మరి మంచు విష్ణు ఈ నమ్మకంతో ఈ సినిమాపై అంత బడ్జెట్ పెడుతున్నాడు అన్నది మాత్రం ఇంకా తెలియదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కన్నప్ప మూవీ బడ్జెట్ 180 కోట్లకు పైగానే అవుతుందని సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవ్వాలి అని లక్ష్యం పెట్టుకున్న మంచు విష్ణు ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి మంచు విష్ణు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో తీస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: