జగన్ పై స్వామీజీ ప్రశంశలు

సీఎంతో జగన్ తో భేటీ ముగిసిన తరువాత మీడియాతో గణపతి సచ్చిదానంద స్వామీ కీలక వ్యాఖ్యలు చేసారు. సచ్చిదానంద పీఠంలో నవరాత్రులు దిగ్విజయంగా నిర్వహించాము అని అన్నారు. కరోన నేటికి కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనలు ప్రభుత్వాలు స్పష్టంగా అమలు చేయాలి అని పేర్కొన్నారు. మంత్రి వెల్లంపల్లి నేతృత్వంలో ఆలయాల అభివృద్ధి జరుగుతుంది అని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం  ఆలయాల పట్ల చిత్తశుద్ధితో ఉందని వివరించారు. హిందూ ధర్మాన్ని, ఆలయాల భూములను కాపాడాలని సీఎంను కోరాను అన్నారు. సీఎం జగన్ ను హిందూ విరుద్ధ వ్యక్తిగా కొందరు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. జగన్ హిందూ ధర్మాన్ని,మతాన్ని పరిరక్షిస్తారని బలంగా నమ్ముతున్నా అని అన్నారు ఆయన. రామ రాజ్యమే ఒక్క రోజులో స్థాపించలేదు,  రాష్ట్రంలో ఒక్క రోజులో మార్పు సాధ్యం అవుతుందా అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: