గడీల పాలన నుంచి తెలంగాణకు త్వ‌ర‌లో విముక్తి... ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యాసంస్థ‌ల‌ను పునఃప్రారంభించిన విష‌యం తెలిసిందే. కానీ గురుకులాల విష‌యంలో ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత‌ ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ఇవాళ‌ ట్విట్ట‌ర్‌లో త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. గురుకులాల విద్యార్థుల‌ను కూలీలుగా మార్చుతున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 
ల‌క్ష‌లాది మంది నిరుపేద విద్యార్థులు చ‌దువుకునే గురుకులాలు, హాస్ట‌ళ్ల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడం అంటే ఒక త‌రాన్ని కూలీలుగా మార్చే కుట్ర‌నే అని ఆరోపించారు. దీంతో చ‌దువుకునే పిల్ల‌లు భూస్వాముల ఇండ్ల‌లో, భూముల్లో కూలీలుగా మారే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు. గ‌డీల పాల‌న నుంచి తెలంగాణ త‌ల్లి విముక్తి చేయాలంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
మ‌రోవైపు గురుకులాల ప్రారంభంపై ఇదివ‌ర‌కు వెల్ల‌డించిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను ఎత్తేయాల‌ని హైకోర్టును కోరింది రాష్ట్ర ప్ర‌భుత్వం. గురుకులాల‌ను ఓపెన్ చేయ‌వ‌ద్ద‌ని ఉత్త‌ర్వులున్నాయ‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై అత్య‌వ‌స‌రంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరింది ప్ర‌భుత్వం. ఎల్లుండి విచార‌ణ‌కు ప‌రిశీలిస్తున్నాం అని ధ‌ర్మాస‌నం పేర్కొంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: