మా ఊరు మా వార్త : లచ్చన్న సభకు ధర్మాన
స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న సంస్మరణార్థం కేంద్ర ప్రభుత్వం ఒక పోస్టర్ కవర్ ను ఆయన ముఖ చిత్రంతో ముద్రంచి, ఆయన సేవలకు గుర్తింపుగా నివాళి ఇస్తూ.. విడుదల చేసింది. దీనిని జిల్లా కేంద్రంలో ఆవిష్కరించే బాధ్యతను గౌతు శ్యామ సుందర శివాజీ (మాజీ ఎమ్మెల్యే) కూతురు గౌతు శిరీష తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు ఈ వేడుకకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బాపూజీ కళామందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు హాజరు కానున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా కింజరాపు కుటుంబంతో ఉన్న అనుబంధం రీత్యా ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుతో పాటు ఇంకొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తరలి రానున్నారు. ధర్మాన ప్రసాదరావుతో సహా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా విచ్చేసి లచ్చన్న సేవలను సంస్మరించనున్నారు. రాజకీయాలకు అతీతంతగా అంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గౌతు వారింటి వారసురాలు శిరీష.