కేసీఆర్ ఈటలను తమ్ముడిలా చూసుకున్నాడు :హరీష్ రావు
తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు హుజురాబాద్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రతిరోజూ హరీష్ రావు హుజురాబాద్ లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ రోజు హరీష్ రావు మాట్లాడుతూ...రైతు బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాలపల్లిలో ప్రారంభించారని చెప్పారు.
ఈటెల రాజేందర్ ను కేసీఆర్ తమ్ముడిలా భావించారని...అలాంటి కేసీఆర్ కు ఘోరీ కడుతా అని ఈటెల మాట్లాడుతున్నాడంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేకుండా ఈటెలకు ఈ స్థాయి వచ్చేదా..? అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.