ఏపీ మంత్రిపై సిబిఐ ఫోకస్...?

మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. 120 మందికి పైగా సాక్షులను విచారణ చేశాము అని సిబిఐ పేర్కొంది. 500 వందలకు పైగా దస్తా వేజులను పరిశీలించాము అని తెలిపారు. దర్యాప్తు చివరి దశకు వచ్చింది..మూడు నెలలో దర్యాప్తు పూర్తి అవుతుందని సుప్రీంకోర్టు కు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.
ఈ సమయంలో ప్రాథమిక విచారణ  జరపమని చెప్పకండి అని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సీబీఐ  తరుపు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. నివేదిక పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని సీబీఐ తరపు న్యాయవాది ఐశ్వర్య బాతి కోరారు. ఈ కేసు ఇప్పుడు మంత్రిలో ఆందోళన పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: