లావు బియ్యం పిల్లలు తినలేకపోతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే

లావు బియ్యం పిల్ల‌లు తిన‌లేక‌పోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు. మధ్యాహ్న బోజన పథ‌కం మంగళగిరి నియోజకవర్గంలో అద్వాన్నంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. సన్న బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని కానీ మంగళగిరి నియోజకవర్గం లో కొన్ని చోట్ల ఇంకా లావు బియ్యమే ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఓ స్కూల్ లో తిన్నానని..లావు బియ్యం పిల్లలు తినలేకపోతున్నారని ఆర్కే స్ప‌ష్టం చేశారు. చాలా హాస్టళ్ల‌కు వాచ్ మెన్ లు లేర‌ని అన్నారు. మంగళగిరి సివిల్ సప్లయస్ అధికారులు అక్రమార్కులకు అంతులేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

మంగళగిరి ప్రాంతంలో వారానికి రెండు మూడు లారీల రేషన్ బియ్యం పట్టుబుడుతుందని ఆరోపించారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పట్టుబడితే జిల్లా వ్యాప్తంగా ఎంత బియ్యం అక్రమంగా తరలుతుందోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. బాలాజీ గ్యాస్ ఏజెన్సీ లో విజిలెన్స్ రైడ్ చేసి సీజ్ చేశారని ఎమ్మెల్యే చెప్పారు.
తెనాలి ఏఎస్ఓ డబ్బులు తీసుకుని సీజ్ చేసిన గోడౌన్ నుండి సిలిండ‌ర్ లు తెప్పించార‌న్నారు. అక్రమ రేషన్ పట్టుబడితే  నామమాత్రపు కేసులు పెడుతున్నారని అధికారుల‌పై ఆరోప‌ణ‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: