ఐస్క్రీమ్ తింటూ శృంగారం గురించి మాట్లాడుకున్నాం : ఆర్జీవీ

టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ ఇంటర్వ్యూ లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ క్రేజ్ కు తోడు వర్మ ఇప్పుడు హాట్ యాంకర్ లతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మరోవైపు యాంకర్ లు కూడా ఆర్జీవీ తో ఇంటర్వ్యూలు చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్జీవీ తో ఒక్క ఇంటర్వ్యూ చేస్తే నెట్టింట వైరల్ అవ్విచ్చని మరింత ఫేం సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇక ఆర్జీవీ తో చేసిన ఇంటర్వ్యూ తోనే అరియానా గ్లోరి సోషల్ మీడియాలో ఫేం సంపాదించింది. అంతే కాకుండా అదే పాపులారిటీ తో అరియానా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భయటకు వచ్చిన తరవాత కూడా అరియానా ఆర్జీవీ తో మరో ఇంటర్వ్యూ చేసింది.

ఆ వీడియో కూడా యుట్యూబ్ లో  ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఇప్పుడు మరో హాట్ యాంకర్ అష్షు రెడ్డి కూడా అరియానా లాగే ఆర్జీవీ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ కు అటు వర్మ ..ఇటు అష్షు ఇద్దరు కూడా ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇటీవలే ఆర్జీవీ అష్షు హాట్ లుక్ కనిపించేలా ఓ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తాజాగా మరో ఫోటోను కూడా వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు వర్మ అష్షు తో ఐస్క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుకున్నాం అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూ కు సంబంధించిన పోస్టర్ ను ఇప్పుడు విడుదల చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: