రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అయోధ్యలో రామాయణ సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రామాయణం ను సామాన్య ప్రజల వద్దకు చేరవేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రామాయణం ను కళల ద్వారా సామాన్య ప్రజల వద్దకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ను తాను అభినందిస్తున్నానని చెప్పారు .
అంతే కాకుండా రామాయణం కు ప్రచారం ముక్యమని రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు.
ఎందుకంటే రామాయణం జీవిత విలువలను..జీవిత సారాంశాన్ని చెబుతుందని అదో తత్వ శాస్త్రమని రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. రామాయణం అందించే విలువలు మానవ జీవితానికి అవసరమని అన్నారు. రామాయణ ఎప్పుడూ మానవులకు మార్గదర్శకంగా నిలుస్తుందని రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. రామాయణం నేర్చకోవడం వల్ల ఎన్నో కొత్త విషయాలు మానవులకు తెలుస్తాయని రామ్ నాథ్ కోవింద్ అన్నారు .