రెచ్చిపోయిన దొంగ‌లు..టీఆర్ఎస్ నాయకుల జేబుల‌కు చిల్లు..!

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా మోత్కూరు లో మంత్రుల ప‌ర్య‌ట‌న సంధ‌ర్బంగా జేబుదొంగ‌లు త‌మ చేతివాటం చూపించారు. నూత‌న మార్కెట్ క‌మిటీ చైర్మెన్ ప్ర‌మాణ స్వీకారం సంధ‌ర్భంగా మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డిలు హాజ‌ర‌య్యారు. అయితే మంత్రులు రావ‌డంతో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు..ప్ర‌జ‌లు భారీగా వ‌చ్చారు. కాగా మంత్రుల‌కు టీఆర్ఎస్ నాయ‌కులు పుష్ప‌గుచ్చాలు..షాలువాలు క‌ప్పి స‌న్మానం చేస్తుంటే బేబు దొంగ‌లు త‌మ టాలెంట్ చూపించారు. 

సంద‌ట్లో స‌డేమీయా అన్న‌ట్టు టీఆర్ఎస్ నాయ‌కుల బేబులు దోచుకున్నారు. జేబుల్లో ఉన్న డ‌బ్బుల‌తో పాటు వ‌స్తువుల‌ను నొక్కేశారు. దీనికి సంభందించిన ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. మంత్రికి నాయకులు పూల దండ‌లు వేస్తుంటే ఓ దొంగ టీఆర్ఎస్ నాయుకుడి జేబులో చేయి పెట్టిన ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ప్రమాణ స్వీకారానికి భారీగా పోలీసుల బందోబ‌స్తు ఉన్న‌ప్ప‌టికీ దొంగ‌లు భ‌య‌ప‌డ‌కుండా త‌మ చేతివాటం చూపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: