యాప్ లోన్ తీసుకున్న వాళ్లకు పండుగే...?
చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ అధికారులు వెల్లడించారు. బోగస్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్ కు నిధులు తరలించినట్లు ఈడీ తన విచారణలో గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో కొందరిని అదుపులోకి తీసుకుంటారు.