తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్రకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కోసం ఓ పాటల సీడీని రూపొందించారు. ఈ పాటల సీడీని నేడు హైదరాబాద్ లోని డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు విజయ శాంతి మరియు మాజీ ఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా విజయ శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం సిద్దం రూపొందించిన పాటలో కేసీఆర్ కుటుంబ పాలన అవినీతిని పాలన గురించి ప్రజలకు తెలిపే విధంగా ఉంటాయని చెప్పారు. అంతే కాకుండా ఈ పాటను ప్రముఖ రచయిత అనంత్ శ్రీరామ్ రచించారని అన్నారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ పాద యాత్ర ఈనెల 24న ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఈనెల 28 కి వాయిదా పడింది.