హైకోర్ట్ లో చిన్న కేసులో కూడా ఓడిపోయిన జగన్ సర్కార్...?

ఏపీలో హైకోర్ట్ లో ఏదైనా కేసు దాఖలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఇబ్బంది పడుతుంది. విపక్షాలు వేసిన ఏ ఒక్క పిటీషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించలేదు. చివరకు తాజాగా ఒక పౌరుడు దాఖలు చేసిన పిటీషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. తనకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ ను నిలిపివేశరని అడబాల రాము అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

పెన్షన్ నిలిపివేసే నాటికి రేషన్ కార్డ్ లేదని న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అయితే పెన్షన్ ను కొనసాగించాలని, నిలిపివేసిన బకాయిలను చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్ట్. ఇక హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులతో అధికారులు కూడా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: