ఏపీలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌..కార‌ణం ఇదే.. !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నేడు, రేపు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. రెండు రోజుల పాటు ఎపిలో జ‌న ఆశీర్వాద్ యాత్ర లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. క్యాబినెట్ లో ప్ర‌మోష‌న్ పొందిన కేంద్ర మంత్రుల ప‌ర్య‌ట‌న‌ల్లో బాగంగా జ‌న ఆశీర్వాద్ యాత్రలో కిష‌న్ రెడ్డి పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట కు కిష‌న్ రెడ్డి రానున్నారు. అనంత‌రం తిరుప‌తి లో పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతారు. కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి తిరుప‌తిలో ర్యాలీ, మీటింగ్ ను నిర్వ‌హిస్తారు. 

ఇక రేపు ఉద‌యం శ్రీ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం తిరుప‌తిలో వ్యాక్సిన్ సెంట‌ర్ ను కిష‌న్ రెడ్డి సంద‌ర్శించ‌నున్నారు. రేపు ఉదయం 11 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం కు కిష‌న్ రెడ్డి చేరుకుంటారు. అనంత‌రం దుర్గ‌ గుడి లో అమ్మ‌వారి ద‌ర్శ‌నంతో పాటు ప‌లు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆ త‌ర‌వాత‌ రోడ్డు మార్గంలో తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: