Breking : ముంబై లో డెల్టా ప్లస్ తో మొదటి మరణం.. !

దేశంలో కరోనా డెల్టా ప్లస్ కేసులు కూడా నమో అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డెల్టా ప్లస్ తో ముంబైలో ఓ మహిళ మృతి చెందింది. గత నెల మహిళ కరోనా బారిన పడినట్టు సమాచారం. ఎంటు వంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినప్పటికీ మహిళ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఆమెను పరీక్షించగా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా కరోనా వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే సదరు మహిళ వ్యాక్సిన్ రెండు డోస్ లు వేసుకున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటే కరోనా పాజిటివ్ రాకమునుపే ఆ మహిళ అనారోగ్యం తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో మహిళ బాధపడుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల దేశంలో ఎటువంటి మరణాలు నమోదవలేదు. దాంతో ఇదే మొదటి మరణం అని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా మృతురాలి కుటుంబంలో మరో ఆరుగురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: