ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య బహిరంగ వార్.. ?

ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వార్ ఇప్పుడు బహిరంగం అయ్యింది. ఉట్నూర్ జెడ్పిటిసి చారులత రెండు కోట్లు తీసుకుని జడ్పీ చైర్మన్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ వైపుకు చేతులు లేపినట్టు ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు భారత్ చౌహాన్ ఆరోపించడం సంచలనంగా మారింది. దాంతో జడ్పీటీసీ చారులత రెండు కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకున్నాను నిరూపించాలని సవాల్ విసిరింది. రెండు కోట్లు ఎక్కడ ఖర్చు చేశానని ప్రశ్నించింది.

ఇంద్రవెల్లి సభ సన్నాహక సమావేశంలో వీరిద్దరి మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయితే ప్రస్తుతం ఈ వీడియోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో వీరిపై హైకమాండ్  చర్యలు తీసుకునే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పిసిసి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ఇంద్రవెల్లి లో భారీ సభను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన బహిరంగ వార్ వైరల్ అవ్వడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: