ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో అయితే రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక ఆకతాయి పోర్న్ సైట్ లో అమ్మాయి ఫోన్ నెంబర్ ను పెట్టాడు. హైదరాబాదులో నివాసముంటున్న సాయి అనే కుర్రాడికి ట్యూషన్ లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి నంబర్ తీసుకున్న సాయి కొద్దిరోజులుగా ఆమెతో మామూలుగానే మాట్లాడేవాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన విచిత్రంగా అనిపించడంతో అమ్మాయి బ్లాక్ చేసింది.
దాంతో పగ పెంచుకున్న యువకుడు ఆ అమ్మాయి మొబైల్ నంబర్ ను ఓ పోర్న్ సైట్ లో అప్లోడ్ చేశాడు. దాంతో ఆ అమ్మాయికి వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో విద్యార్థిని పోలీసు కేసు నమోదు చేసింది. ఈ ఘటన పై విచారణ జరిపిన పోలీసులు లో పోర్న్ సైట్ లో సాయి అమ్మాయి నెంబర్ అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దాంతో సాయి ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఆకతాయిల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.