తిరుమలలో భక్తుల ఆందోళన!
ఇక ఎంబీసీ కార్యాలయం వద్దకు చేరుకుని భక్తులకు పోలీస్, విజిలెన్స్ సిబ్బంది సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమకు దర్శన టికెట్లు ఎందుకు కేటాయించలేదని భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు భక్తులు. అదనపు ఈవో కార్యాలయంలో తాము తీసుకొచ్చిన సిఫార్సు లేఖలను స్వీకరించి ఇప్పుడు దర్శనం తిరస్కరిస్తే మేము ఏమి చేయాలని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఇక కరోనా కారణంగా చాలా తక్కువ సంఖ్యలో దర్శనానికి అనుమతి ఇస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.