పదవ తరగతి పరీక్ష ఫలితాల విధానాన్ని ప్రకటించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఉన్నత స్థాయి కమిటీ తాజాగా మార్కుల విధానాన్ని ఖరారు చేసి ప్రకటించింది. బుధవారం నాడు తుది సమావేశం నిర్వహించిన కమిటీ పది ఫలితాల పై నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
అనంతరం ప్రభుత్వం ఆదేశాలనుసారం ఎస్ఎస్సీ బోర్డు పది ఫలితాలను విడుదల చేస్తుంది. కమిటీ నిర్ణయించిన విధానం పరంగా... 50 మార్కులకు నిర్వహించిన ఫార్మేటివ్ పరీక్షలో 20 మార్కుల రాతపరీక్షకు 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. మిగిలిన 30 మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. వీటిని కలిపి ఫార్మేటివ్ మార్కులను లెక్కిస్తారు. వాటితో సబ్జెక్ట్ గ్రేడ్ ఇవ్వనున్నారు. ఇక అన్ని మార్కులు కలిపి మొత్తం ఒక గ్రేడ్ ను ప్రకటిస్తారు. అయితే హిందీ సబ్జెక్ట్ గ్రేడ్ విధానం మాత్రం వేరుగా ఉంది.