ఈరోజు రేషన్ బంద్.. !

తెలంగాణ రాష్ట్రంలో వెబ్ సైట్ల సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేషన్ బియ్యం పంపిణీ కూడా నిలిచిపోతుందని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. డాటా సెంటర్లలో సర్వర్లను ఆధునికీకరిస్తున్న నేపథ్యంలో బియ్యం పంపిణీ నిలిపి వేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం నుండి యథావిధిగా మళ్ళీ బియ్యం పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు.

మరోవైపు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణి చేయాల్సి ఉండగా ఇప్పటికే పది రోజులు ఆలస్యమైంది. కరోనా  వైరస్ నేపథ్యంలో బియ్యం పంపిణీ 10రోజులు ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. ఇక రేషన్ బియ్యం సరఫరా మాత్రమే కాకుండా యుపిఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాంతో భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సేవలు సైతం నిలిచిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: