తెలంగాణవి అక్రమ ప్రాజెక్ట్ లు : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వాటర్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు. ఈ లేఖలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. జూన్ 30 న రాయలసీమ ఎత్తిపోతల కు సంబంధించిన డిపిఆర్ ను సిడబ్ల్యుసి కి అప్లోడ్ చేశామని పేర్కొన్నారు. ఈ పథకానికి ఎటువంటి భూ సేకరణ చేయడం లేదని చెప్పారు.

అటవి ప్రాంతం కానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు గానీ అడ్డంకిగా లేవన్నారు. ఈ పథకం పర్యావరణ పరిరక్షణ జోన్ కు 10 కిలోమీటర్లు బయట నిర్మించడానికి తల పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను కెఆర్ఎంబి సందర్శించాలని  కోరారు. తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ను సందర్శించాలని అన్నారు. తెలంగాణ వైఖరితో ఏపీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. నీరు తక్కువగా ఉన్నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: