ప్రధాని మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సంధర్బంగా ప్రధాని ముఖ్యంగా వ్యాక్సినేషన్ మరియు దేశంలో కరోనా పరిస్థితులపై మాట్లాడారు. ఈ శతాబ్దంలో ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని మోడీ వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సీజన్ అవసరం ఎప్పుడూ రాలేదని తెలిపారు. కరోనావల్ల దేశ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. ఆర్మి, నేవీ అన్నీ ఉపయోగించి ఆక్సీజన్ కొరత తీర్చామని తెలిపారు. ప్రపంచంలోనే ఆక్సీజన్ ఉత్పత్తి చేసే సంస్థలు తక్కువ ఉన్నాయని తెలిపారు. ఆధునిక కాలంలో ఇటాంటి కొరత ఎప్పుడూ రాలేదని చెప్పారు. దేశంలో ఆక్సీజన్ ఉత్పత్తిని పది రెట్లు పెంచుతామని అన్నారు. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విశాదమని అన్నారు. ఒకరకంగా యుద్దం చేశామని అన్నారు.