వియత్నాం, సింగపూర్ దేశాల నుండి భయలుదేరిన భారత నావికాదళ ఓడ ఐఎన్ఎస్ ఐరవత్ నిన్న విశాఖపట్నం చేరుకుంది. ఈ ఓడలో ఏడు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులలో 158 మెట్రిక్ టన్నుల ద్రవ వైద్య ఆక్సిజన్, 2722 ఆక్సిజన్ సిలిండర్లు మరియు 10 వెంటిలేటర్లతో సహా ఇతర కోవిడ్ సహాయక పదార్థాలు ఉన్నాయి. కరోనా సహాయక సామాగ్రిని వివిధ దేశాల నుండి భారత్ కు రవాణా చేయడానికి భారత నావికాదళం ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర సేతు -2 లో ఈ భాగంగా విశాకకు ఐరావత్ ను పంపించారు. ఈ ఆక్సీజన్ ట్యాంక్ లను, కరోనా సయాయక సామాగ్రిని వివిధ ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్జీవో ల నిధులతో సప్లై చేస్తున్నారు.