తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోభారావుకు సంభందించిన ఓ పెన్సిల్ స్కెచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కేసీఆర్ సతీమణి మనసారా నవ్వుతుండగా కేసీఆర్ ఆమెను చూసుకుంటూ నవ్వుతున్నారు. ఇద్దరి ముఖాలలో ఆనందం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. అంతే కాకుండా ఈ ఫోటోలో ఇద్దరి వెనకాల తెలంగాణ సంక్షేమం కోసిన యాగానికి సంభందిచిన సీన్ కనిపిస్తోంది. కాగా తాజాగా ఈ ఫోటోను చిత్ర కారుడు కోట వెంకట చారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కాగా ఈ ఫోటోను చూసి కేసీఆర్ మనవడు హిమాన్షు ఫిదా అయ్యారు. నానమ్మ తాతయ్య పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ హిమాన్షు దాన్ని షేర్ చేశారు. అంతే కాకుండా చిత్రకారుడికి హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. ఈ పెయింటింగ్ ను వెంకటాచారి వేయగా యర్రోజు చందు అనే వ్యక్తి కేటీఆర్ మరియు హిమాన్షుకు ట్యాగ్ చేశారు. అలా హిమాన్షు కన్ను పడటంతో తాత నానమ్మల ఫోటోకు ఫిదా అయ్యారు.