ప‌రుగులు పెడుతున్న ప‌సిడి..తాజా ధ‌ర ఎంతంటే..?

ప‌సిడి ప‌రుగులు పెడుతోంది. రెండు నెల‌ల క్రితం కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు మ‌ళ్లీ పైపైకి వెళుతున్నాయి. తాజా ధ‌ర‌ల‌ను పరిశీలిస్తే దేశీయంగా బంగారం 10 గ్రాముల ధర పై ఏకంగా రూ.1330 వరకు పెరిగింది. దేశంలోని వివిధ న‌గ‌రాల‌లో ధ‌రలు పెరిగాయి. ఒక్కో న‌గ‌రంలో ఒక్కో విధంగా బంగారం ధ‌ర పెరింగింది. కాగా హైద‌రాబాద్ లో ధ‌ర నిల‌క‌డ‌గా ఉండగా ఢిల్లీ, చెన్నై, ముంబై తదితర నగరాల్లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. తాజాగా గురువారం బంగారం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే.... హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా.... 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ఇక విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,300 వద్ద ఉండ‌గా...22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 గా ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250 ఉండగా...22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 47,000 గా ఉంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం 50వేల‌కు చేరిన బంగారం ధ‌ర‌లు ముందు మందు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: