జగన్ మరో సంచలన నిర్ణయం... దేశ రాజకీయాల్లో కొత్త రికార్డ్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలతో పాలనా పరంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వేళ జగన్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లోనే సరికొత్త నాంది అనేలా ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమాకం చేయాలని నిర్ణయించింది.
రేపు అన్ని కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైెస్ ఛైర్మన్ ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అదే రికార్డు అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఇద్దరు వైస్ చైర్మన్లతో మరో సంచలనం క్రియేట్ చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్‌కు పంపి ఆమోదించుకునేలా ఉన్నారు.