బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

VUYYURU SUBHASH
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అధికార వైసీపీ నుంచి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఓ ఎమ్మెల్సీ విష‌య‌మై జ‌గ‌న్ చల్లా భగీరధరెడ్డి కి హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన స్థానంలో కుమారుడికి అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించారు. ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి చల్లా భగీరధరెడ్డికి జగన్ ఖరారు చేశారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: