ఆరోగ్య శ్రీ మాదే అంటున్న ఏపీ కాంగ్రెస్...!

ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ మానస పథకం  అని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి స్పష్టం చేసారు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే ఆశయంతో ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది అని ఆయన వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు చేసారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలన్న వైకాపా ఆలోచన అవివేకం అని ఆయన ఆరోపించారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ,  ఆరోగ్య శ్రీ నెట్వర్క్ పరిధి ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులు లేక మూతపడతాయి అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స నాణ్యత తక్కువై అవినీతి పెరిగిపోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆరోగ్య కేంద్రాలతో సమరవంతంగా పనిచేయించుకోకుండా కొత్తగా విల్లాజ్, అర్బన్ క్లినిక్లు ఏర్పాటు చేయడం అవివేకం అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: