ఫెలుదా స్ట్రిప్ పరీక్షను కరోనా టెస్ట్ కి గ్రీన్ సిగ్నల్..!

Lokesh
కరోనాను గుర్తించేందుకు యాంటీజెన్‌ తరహాలో స్వదేశీయంగా తయారు చేసిన ఫెలుదా పేపర్‌ స్ట్రిప్​ పరీక్షను కూడా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబోరేటరీలు నిర్వహించుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం​ఆర్​) స్పష్టంచేసింది. ఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు దీన్ని అభివృద్ది చేశారు.కాగితం ద్వారా చేసే ఈ నూతన పరీక్ష విధానంతో గంటలోపే ఫలితాలను పొందవచ్చని ఐసీఎంఆర్‌ పేర్కొంది.

వీటి ద్వారా పరీక్ష చేసుకుంటే మరోసారి ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​లకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరీక్షను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతించిందని పేర్కొంది.ఫెలుదా పేపర్‌ స్ట్రిప్‌ పరీక్షను ప్రయోగాత్మకంగా రెండు వేల మందిపై నిర్వహించగా.. 96 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: