గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన విద్యుత్ శాఖ మంత్రి..?

praveen

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి  విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి... తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 అయితే కేవలం నాయకులు అధికారులు మాత్రమే కాకుండా... ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  మొక్కలు నాటుతు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్న విషయం తెలిసిందే. అలాగే చాలా మంది క్రీడాకారులు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: