రెచ్చగొడితే దేనికైనా సిద్ధం.. తుపాకి ఎక్కుపెట్టి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్.?
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు సరిహద్దుల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయమే సరిహద్దులకు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్ కి ఆర్మీ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులతో చర్చించిన అనంతరం... సైన్యం మొత్తం విన్యాసాలు చేసి రాజ్ నాథ్ సింగ్ కి చూపించింది . చైనా సైన్యం ఏమాత్రం తోక జాదించిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చింది.
ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా తుపాకి పట్టుకొని సైనికుల్లో ఉత్సాహం నింపారు. ఫుల్లీ లోడెడ్ తుపాకి ని పట్టుకున్న రాజ్ నాథ్ సింగ్ చైనా వైపు ఎక్కుపెట్టి దేనికైనా సిద్ధం అనే విధంగా సంకేతాలు ఇచ్చారు. భారత ఆత్మాభిమానాన్ని ఎవరు దెబ్బతిన్న లేరు అంటూ ఈ సందర్భంగా మాట్లాడారు రాజ్ నాథ్ సింగ్ . భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా వదులుకునే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు. సైనికులందరిలో మరింత ప్రోత్సాహం నింపేలా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.