మాస్కు పెట్టుకోవడం వీరుడి లక్షణం : చిరంజీవి

praveen

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటినుంచి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ పై అందరికీ సూచనలు సలహాలు ఇస్తూ  అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 


 చిరునవ్వు ముఖానికి అందం కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే మాస్కు ధరించాలి అంటూ చిరంజీవి చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. మీసం మెలెయ్యటం   వీరత్వం అనేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మాస్క్  ధరించడమే వీరుడి లక్షణం అంటూ మెగాస్టార్ చిరంజీవి సందేశమిచ్చారు. కరోనా కట్టడికి మాస్క్ అందరూ తప్పనిసరిగా ధరించండి.  మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ కుటుంబాన్ని దేశాన్ని కాపాడండి ప్లీజ్ అంటూ చిరంజీవి ప్రతి ఒక్కరిని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన సందేశం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: