బ్రేకింగ్ : భారత్ పై పంజా విసురుతోన్న కరోనా... 14 కోట్ల 70 లక్షల ఉద్యోగాలు ఊస్ట్....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. దేశంలో కరోనా విజృంభించిన తొలి నాళ్ల నుంచి నాలుగు నెలల్లో 14 కోట్ల 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. సిడ్నీకి చెందిన 'ప్లోస్‌ వన్‌' అనే రీసెర్చ్‌ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. 
 
కంపెనీ యాజమాన్యాలు 3.8 ట్రిలియన్ల ఉత్పత్తిని కరోనా మహమ్మారి వల్ల కోల్పోయినట్లు ప్లోస్ వన్ ప్రకటించింది. ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల ఉద్యోగులు 2.1 ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్లోస్ వన్ తెలిపింది. పర్యాటక రంగం, తయారీ రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: