బ్రేకింగ్ : జమ్మూ కశ్మీర్ లో బలగాలను దించుతోన్న కేంద్రం... భయాందోళనలో ప్రజలు...?

Reddy P Rajasekhar

జమ్మూ కశ్మీర్ సర్కార్ ఆయిల్ అండ్ గ్యాస్ డీలర్లకు రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ నిల్వలను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆదేశాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఏం జరగబోతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం 16 విద్యాసంస్థల భవనాలను ఆధీనంలోకి తీసుకుని ఆయా భవనాలలో కేంద్ర పారా మిలిటరీ బలగాలను దించుతోంది. 
 
గతేడాది భారీస్థాయిలో బలగాలను దించి ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్రం ప్రస్తుతం ఏం చేయబోతుందో అర్థం కాక ప్రజల్లో తెలియని భయం నెలకొంది. కేంద్రం ఏదో బలమైన కారణంతోనే బలగాలను దించబోతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. చైనా, పాక్ దేశాల కుట్రలకు చెక్ పెట్టడానికే భారత్ బలగాలను దించుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: