బ్రేకింగ్ : 21న టీటీడీ ఆలయం మూసివేత... ఎందుకంటే...?
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఈ నెల 21వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా టీటీడీ ఆలయ తలుపులు మూసివేస్తున్నామని తెలిపారు. శ్రీవారి ఆలయం తలుపులను శనివారం రాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేస్తున్నామని ఆలయ శుద్ధి అనంతరం తెరుస్తామని ప్రకటన చేశారు. జూన్ 30 వరకు రోజుకు మూడు వేల చొప్పున ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేశామని చెప్పారు.
ఆన్‌లైన్ టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని సూచించారు. సర్వదర్శనం కోసం తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ప్రతిరోజూ మూడువేల చొప్పున ఈ నెల 22వ తేదీ వరకు టికెట్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు.