అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్లు కష్టాలు పడుతున్నారు... సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అమలు సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ పేదవాడు సంతోషంగా ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 2,62,495 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని అన్నారు. తొలి ఏడాది ఈ పథకం ద్వారా దాదాపు 2 లక్షల మందికి లబ్ధి చేకూరిందని... ఈ సంవత్సరం అదనంగా 37,000 మంది కొత్త లబ్ధిదారులు చేరారని అన్నారు.
అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా కష్టాలు పడుతున్నారని వారిని ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశానని... ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సహాయం అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.