ఏపీలో త్వరలోనే ఎన్నికలు... నిమ్మగడ్డ రమేశ్ కీలక వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

ఏపీ హైకోర్టు ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంలో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోలను రద్దు చేసి రమేశ్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు అనంతరం నిమ్మగడ్డ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతం కాదు రాజ్యాంగం శాశ్వతమని అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని... అన్ని పార్టీలతో మాట్లాడి ఎన్నికలు జరిపిస్తామని వ్యాఖ్యలు చేశారు. 

 

హైకోర్టు తక్షణమే ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించటంతో ఆయన విధుల్లో . హైకోర్టు తీర్పుతో కనగరాజ్ పదవి తొలగినట్టేనని నిపుణులు చెబుతున్నారు. బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత పెరిగిందని ఆయన అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: