ఆ టెక్నిక్ మార్చుకోవడం నాకు కీడు తలపెట్టింది..రాబిన్ ఉతప్ప !!

Surya

భరత్ తరపున టెస్ట్ క్రికెట్ లో ఆడడమే నా అతి పెద్ద లక్ష్యంగా 25 సంవత్సరాల వయసులో బ్యాటింగ్ టెక్నిక్స్ మొదలు పెట్టడమే తన కెరీర్ నాశనానికి నాంది పలికిందని భారత క్రికెట్ ఆటగాడు రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఈ తప్పిదం వల్లనే నా మునుపటి ఆట పదును తగ్గిందని చెప్పాడు. ఆ తప్పిదం వల్లనే తాను భారత వన్ డే జట్టు నుండి దూరం కావడనికి నాంది పడిందని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న రాబిన్ ఉతప్ప ఆ జట్టుకు సంబందించిన సోషల్ మీడియా లైవ్ సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ నాశనమవ్వడానికి గల కారణాలు పేర్కొన్నాడు.

 

అయితే 20 -21 సంవత్సరాల వయసులో మార్చుకోవాల్సిన బ్యాటింగ్ శైలిని 25 సంవత్సరాల వయసులో మార్చుకోవడం వల్ల నా పాత బ్యాటింగ్ టెక్నిక్స్ మరుగున పడ్డాయని చెప్పాడు. అయితే ఎప్పటికైనా భారత టెస్ట్ క్రికెట్ జట్టులో స్తానం సంపాదించాలన్నది తన లక్ష్యంగా పేర్కొన్నాడు. 2006 లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఊతప్ప. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో సభ్యుడు . త‌ర్వాత జట్టులో స్తానం కోల్పోయి కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఊత‌ప్ప 46 వ‌న్డేలు, 13 టీ20లు ఆడాడు. చివ‌రిసారిగా 2015లో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున తొలి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా  రాబిన్‌ ఊతప్ప  నిలిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: