మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.... ముంబైలోనే 20 వేల పాజిటివ్ కేసులు...?
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 35,086 మంది కరోనా భారీన పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 3,155 మంది కరోనా భారీన పడి చనిపోగా 1,249 మంది మృతి చెందారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 8,437 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది కరోనా భారీన పడగా 18 లక్షల మంది కరోనా భారీన పడ్డారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో 15 లక్షల మంది కరోనా భారీన పడ్డారు. 15 లక్షల కేసులలో న్యూయార్క్ లోనే దాదాపు 3,59,000 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 91,000 దాటింది.