సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్ ట్రెండ్...!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మరో 5 రోజులు ఉండగానే సోషల్ మీడియాలో ఇప్పుడు అతని పుట్టిన రోజు సందడి ఒక రేంజ్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అతని పుట్టిన రోజు సందర్భంగా ట్రెండ్స్ కూడా మొదలు పెట్టారు. ట్విట్టర్ వేదికగా షేక్ చేస్తున్నారు.
అతనికి సోషల్ మీడియా నుంచి గ్రాండ్ గా విష్ చేయడానికి గానూ మార్చ్ 19 ఉదయం 6 గంటల నుంచి ట్రెండ్ చేయనున్నారు. అతని సినిమా ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పుడు ట్విట్టర్ లో పలువురు సినీ ప్రముఖులు కూడా అతనికి ముందు గానే విష్ చేస్తున్నారు.
5 Days To Go For The mass Carnival 💥
Trend From May 19th @ 6 PM 🔥#KomaramBheemNTR @tarak9999 pic.twitter.com/WccGdiTdY3 — jr ntr Trends™ (@TrendJrNTR) May 15, 2020