
20 లక్షల కోట్లు : వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీధి వ్యాపారులకు 5,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. డిజిటల్ పేమెంట్లను ఉపయోగించే వారికి మరిన్ని రాయితీలు కల్పిస్తామని అన్నారు. ముద్ర, శిశు రుణాలపై 2 శాతం రాయితీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 50,000 లోపు రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
3 కోట్ల మందికి రాయితీ తగ్గింపు ప్రయోజనం పొందుతారని అన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేస్తామని అన్నారు. రేషన్ కార్డులు లేనివారు బియ్యం, పప్పు పొందవచ్చని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని అన్నారు.