తొలి లిప్‌లాక్‌కు 87 ఏళ్లు... ఆ లిప్‌లాక్ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..!

VUYYURU SUBHASH

లిప్‌లాక్‌లు నేటి సినిమాల్లో కామన్‌గా మారిపోయాయి. ముద్దు సన్నివేశాలు లేకుండా సినిమాలు ఉండ‌డం లేదు. ఇప్పుడున్న రొమాన్స్ యుగంలో లిప్‌లాక్‌లు లేక‌పోతే సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు కూడా రావ‌డం లేదు. యువ‌త‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు లిప్‌లాక్‌లు మెయిన్ హైలెట్‌గా.. ఎర‌గా ఉంటున్నాయి. ఇక ఛాన్సుల కోసం హీరోయిన్లు కూడా లిప్‌లాక్‌ల‌కు సై అంటున్నారు. అయితే భార‌త దేశ సినిమాల్లో లిప్‌లాక్‌లు ఇప్ప‌టి నుంచే కాదు.. ఇవి దాదాపు 9 ద‌శాబ్దాలు అంటే 90 సంవ‌త్స‌రాల క్రితం నుంచే ఉన్నాయి. 

 

మ‌న‌దేశంలో తొలి లిప్‌లాక్ సినిమా ఏదో తెలుసా... అది మ‌ళ‌యాళ సినిమా మార్తాండ‌వ‌ర్మ‌. 1933లో రూపొందిన ఈ చిత్రంలో  ఏవీపీ మీనన్‌, పద్మినిలపై ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు.  ఇండియన్‌ స్క్రీన్‌పై ఇదే తొలి లిప్‌లాక్‌. అంటే ఈ లిప్‌లాక్ సినిమా వ‌చ్చి 87 ఏళ్లు అవుతోంది. అప్ప‌ట్లో బ్లాక్ అండ్ వైట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు పీవీ రావుదర్శకత్వం వహించారు. మలయాళ సాహిత్యం ఆధారంగా తెరకెక్కిన మొదటి సినిమా ఇది. 

 

అయితే అదే సంవ‌త్స‌రం హిందీలో ఏకంగా నాలుగు నిమిషాల లిప్ లాక్ సీన్ కూడా ఓ సినిమాలు పెట్టారు. దేవికారాణి, హిమాన్షురాయ్‌లపై చిత్రీకరించారు. ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.   దేవికారాణి,  హిమాన్షురాయ్‌ నిజజీవితంలో భార్యాభర్తలు కావడం గమనార్హం. హిందీ చిత్రసీమలో ఎక్కువ నిడివి కలిగిన లిప్‌లాక్‌గా ఇప్పటికీ కర్మ సినిమా రికార్డు అలాగే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: