హెరాల్డ్ బర్త్ డే : 16-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 16వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 పూసపాటి అశోక్ గజపతిరాజు జననం  : ప్రముఖ రాజకీయవేత్త, మాజీ లోక్సభ సభ్యుడు అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు 1951 జూన్ 16వ తేదీన జన్మించారు. తొలిసారిగా  జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేశారు పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి 1983,85, 89, 84,99, 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. 36 ఏళ్ల అశోక్ గజపతిరాజు రాజకీయ జీవితంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొంది పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.2014లో ఎంపీ గా ఎన్నుకోబడ్డ అశోక్ గజపతిరాజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

 

అంజలి జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అంజలీ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. అంజలి 1986 జూన్ 16వ తేదీన జన్మించారు. తమిళ తెలుగు కన్నడ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి . తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఎన్నో పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యింది అంజలి. 2007 సంవత్సరంలో తమిళ మూవీ ద్వారా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. 

 


 ప్రియాంక అరుల్ మోహన్ జననం  :  ప్రముఖ మోడల్ నటి అయిన ప్రియాంక అరుల్ మోహన్ 1999 జూన్ 16వ తేదీన జన్మించారు. ఇప్పుడు వరకు తెలుగు కన్నడ తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు ప్రియాంక అరుల్ మోహన్. కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా తన కెరీర్ను ప్రారంభించిన ప్రియాంక అరుల్ మోహన్... తెలుగులో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో వచ్చిన థ్రిల్లర్ మూవీ గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ప్రియాంక అరుల్  మోహన్.

 


 వీ హనుమంతరావు జననం : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక అయినా వీ  హనుమంతరావు తెలుగు ప్రజానీకానికి కొసమెరుపు. అయితే వరుసగా మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఘనత సాధించారు పీహెచ్. ఈయన  1948 జూన్ 16వ తేదీన జన్మించారు. ఇక ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో సార్లు వివిధ పదవులను అలంకరించారు హనుమంతరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: