హెరాల్డ్ బర్త్ డే : 26-04-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

ఏప్రిల్ 26వ తేదీ ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి . 

 

 మహమ్మద్ ప్రవక్త జననం : అరబ్బులు మత రాజకీయ నాయకులు ఇస్లాం యొక్క చివరి ప్రవక్త ముస్లింలు ఇస్లాంను ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తూ ఉంటారు. ఇస్లాం పరంపర ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమైనది. అమెరికా ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్ ప్రవక్త చివరివాడు. ముస్లిమేతరులు సాధారణముగా ఇతనిని ఇస్లాంమత స్థాపకులు గా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది మాత్రం ఆదిపురుషుడైన ఆదమ్ ప్రవక్తతో. ముస్లిం ప్రకారం 40 ఏళ్ళ వయసులో మక్కా కు సమీపంలోని హిరా గుహ లో ధ్యానం చేయు చుండగా దివ్యదృష్టిని పొందిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. మొహమ్మద్ ప్రవక్త 570 ఏప్రిల్ 26వ తేదీన జన్మించారు.

 

 

 శ్యామశాస్త్రి జననం  : కర్ణాటక సంగీత విద్వాంసులు వాగ్గేయకారులు సంగీత త్రిమూర్తులలో మూడవ వాడు శ్యామాశాస్త్రి 1762 ఏప్రిల్ 26వ తేదీన జన్మించారు. శ్యామశాస్త్రి అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యం ఈయన తంజావూరు జిల్లాలోని తిరువారూరు గ్రామంలో జన్మించాడు. ఈయన తెలుగు సంస్కృత పండితులు వద్ద సంగీత ఆరంభ పాటలు అభ్యసించి సంగీత విద్వాంసులుగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

 

 గణపతి స్థపతి  జననం : శ్రీశైలం దేవస్థానం పునరుద్ధరణ భద్రాచలం రామాలయం మహా మండపం నిర్మాణం లో గణపతి స్థపతి పేరుతెచ్చుకున్నారు, హుస్సేన్ సాగర్లో జిబ్రాల్టర్ రాక్ పై  58 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల విగ్రహాన్ని ప్రతిష్టించారు గణపతి స్థపతి. ప్రముఖ స్థపతి వాస్తుశిల్పి అయిన ఈయన 1931 ఏప్రిల్ 26వ తేదీన జన్మించారు. ఆరేళ్ల చిరు ప్రాయం నుంచే ఉలి పట్ట చెక్కుతున్న గణపతి ని చూసి ఇప్పటికైనా దేశం గర్వించదగ్గ శిల్పి  అవుతాడు అని అనుకున్నారు. శిల్పాలు చెక్కడం లోని ఆలయాలు నిర్మించడం లోనే కొత్త ఒరవడిని సృష్టించి ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు గణపతి స్థపతి. 1964 లో అప్పటి మంత్రి వర్యులు కల్లూరి చంద్రమౌళి దృష్టిని ఆకర్షించారు. బద్రీనాథ్ దేవాలయం మండపం ని కూడా ఈయన చెక్కారు.దీనికి గాను బంగారు గొలుసులు 60 తులాల డాలర్ ను   బహూకరించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 

 

 కాకాని చక్రపాణి జననం : తెలుగు కథా రచయిత మానవ జీవన సంఘర్షణలకు  ఆత్మీయ అనుబంధాల ముఖ్యమైన శైలి  రూపుదిద్దు గల రచయిత అయిన  కాకాని చక్రపాణి 1942 ఏప్రిల్ 26వ తేదీన జన్మించారు. ఆయన దాదాపుగా 12 నవలలు రాశారు ఈయన  రాసిన నవలలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి . ఎన్నో కథలను కూడా రాసిన ఈయన లెక్కకు మించిన అనువాదాలు వ్యాసాలు రచించారు. కానీ నాలుగు కథా సంపుటాలను ప్రచురించారు. తన రచనలలో మనుష్యులు కోల్పోతున్న ఆపేక్షలను గుర్తించాడు.మనుషులు  పోగొట్టుకుంటున్న విలువల్ని చెప్పాడు.  అసలు మనిషికి స్వేచ్ఛ ఉందా ఉంటే ఏ మేరకు ఏ వ్యక్తి అయినా జీవించ గలడు అంటూ  ఎన్నో వ్యాసాలు కూడా రాశారు కాకాని చక్రపాణి. 

 

 కొమరవోలు శివప్రసాద్ జననం : తెలుగువారిలో సంగీతకారులు ప్రసిద్ధులు ఇప్పటి వరకు 11 వేలకు పైగా సంగీత కచేరీలు చేసిన వ్యక్తి అయిన కొమరవోలు శివప్రసాద్ 1955 ఏప్రిల్ 26వ తేదీన జన్మించారు. భారత్ లోనే  కాకుండా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లాంటి విదేశాలలో కూడా ఈల పాటలతో సంగీత కచేరీలు చేస్తూ సంగీతాభిమానులకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితమే బాలమురళీకృష్ణ శివప్రసాద్ ను తన వద్ద ఉంచుకుని సంగీతంలోని మెళుకువలు నేర్పించారు. ఈయన కచేరీలకు ఎన్నో అపురూపమైన సన్మానాలను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: