"పసుపు" తో అందాన్ని మరింత పెంచే చిట్కాలు..

Bhavannarayana Nch

పసుపు యొక్క సద్గుణాలు భారతీయులకి మాత్రమే ఎక్కువగా తెలుస్తాయి..మన పూర్వీకులు ఈ పసుపుపై ఎంతో పరిశోధనలు చేసి దీనిని ఒక దివ్యమైన ఔషధంగా ప్రపంచానికి చాటి చెప్పారు..పసుపుని ఆహార పదార్దాలలోకి మరియు శుభకార్యలలోకి అనారోగ్యాల సమయంలో  ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు..అయితే పసుపు వలన ఆరోగ్యం ఎంత పదిలంగా ఉంటుందో అదేవిధంగా అందాన్ని పెంచే సాధనంగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది..

 


పసుపును ఉపయోగించి వివిధ చర్మ సమస్యలు తొలగించుకోవచ్చు..అదే సమయంలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు..పసుపును ఎటువంటి చర్మ తత్త్వం ఉన్నవారైనా ఉపయోగించవచ్చు. మనలో మొటిమలు తరుచూ వస్తూ ఉంటాయి అయితే ఈ మొటిమలు పోగొట్టడానికి పసుపులో ఉండే యాంటి సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు, మొటిమలను పోగొట్టడంలో సహాయపడతాయి. భారతదేశంలో చాలామంది స్త్రీలు మెరిసే చర్మం కొరకు పసుపును చర్మానికి లేపనంగా పూస్తారు



అంతేకాదు పసుపులో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు చర్మం పై పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి ఉపయోగపడుతాయి...దీని కోసం పసుపు మరియు కొన్ని నిమ్మరసం చుక్కలు తీసుకుని బగా కలిపి పిగ్మెంటేషన్ ప్రభావిత ప్రదేశంలో రాయండి. ఇరవై నిమిషాలు ఆరనిచ్చిన తరువాత నీటితోకడిగేయండి.ఇలా ప్రతీ రోజూ చేసి చూడటం వలన తప్పకుండా చర్మం సున్నితంగా తయారవుతుంది. చర్మ సమస్యలు సైతం దరి చేరవు..అంతేకాదుపసుపులో ఉండే మరొక గుణం ఏమిటంటే.. పసుపులో నొప్పి నివారణ తత్వాలు మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు ఉంటాయి...ఇవి కాలిన గాయాలకు వాపు రాకుండా చూస్తాయి. పసుపును కొబ్బరినూనె, ఆముదం, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలతో కలిపి కాలిన గాయాలపై పూస్తే తప్పకుండా నయం అవుతుంది ..

 

అయితే..వేసవికాలలో ఎక్కువగా చాలా మందికి చర్మం జిడ్డుగా మారిపోతుంది ముఖం అంతా జిడ్డుగా ఉంటుంది అటువంటి వారికోసం పసుపు తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఒక టీ స్పూన్ గంధం పొడికి, కొంచం పసుపు కలపండి. దీనికి కొన్ని చుక్కల నారింజ రసం కలిపి ముఖానికి రాయండి, పదిహేను నిమిషాలు ఆరనిచ్చి నీటితో శుభ్రంగా కడిగేయండి..చర్మం తప్పకుండా నిగారింపుకొస్తుంది జిడ్డు పోతుంది...






 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: